గత కొద్ది రోజుల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అంకితమిస్తూ చేసిన ఓ స్పెషల్ వీడియోని మీకందించాము. ఈ సాంగ్ ని ఈటీవీలో బాగా ఫేమస్ అయిన జబర్దస్త్ షో కోసం చేసారు. ఈ పాటకి సంబందించిన ఎపిసోడ్ ఈ రోజు ఈటీవీలో ప్రసారం కానుంది. జబర్దస్త్ టీవీ షో ని మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఊహినచని స్థాయిలో ఉన్న అభిమానుల విషయంలో, ఆయనకి వస్తున్న పాపులారిటీ పట్ల పవన్ కళ్యాణ్ ఎంతో ఆనందంగా ఉన్నారు. రామ్ గోపాల్ వర్మని బాగా ఇమిటేట్ చేసే షకలక శంకర్ ఈ పాటని పాడారు. ‘జబర్దస్త్’ టీం ఈ పాటకి సాహిత్యం అందించారు.
జబర్దస్త్ షో ఈ రోజు(గురువారం) రాత్రి ఈటీవీలో 9:30 నిమిషాలకు ప్రసారమవుతుంది.
ఈ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.