ఎన్టీఆర్ ‘డ్రాగన్‌’ పై క్రేజీ గాసిప్ ?

ఎన్టీఆర్ ‘డ్రాగన్‌’ పై క్రేజీ గాసిప్ ?

Published on Jun 9, 2025 11:21 PM IST

ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా పై రోజుకొక రూమర్ వినిపిస్తోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం, వచ్చే షెడ్యూల్ లో ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సీక్వెన్స్ కోసం ప్రత్యేకంగా ఓ భారీ టెంపుల్ సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ ఈ సినిమా మొత్తానికే మెయిన్ హైలెట్ గా నిలిచిపోతుందని, ఈ సీక్వెన్స్ పూర్తిగా ‘ఎన్టీఆర్ – విలన్స్’ పైనే నడుస్తోందని తెలుస్తోంది. ఇక ఈ మూవీ టైటిల్ ‘డ్రాగన్‌’ అని ప్రచారంలో ఉంది.

ఐతే, ‘డ్రాగన్‌’ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట. అందుకే, ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా టైమ్ తీసుకున్నాడు. కాబట్టి, ఇప్పటి వరకూ ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాల్లోకల్లా బెస్ట్ సినిమా ఇదే అవుతుందని అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు