బాక్స్ ఆఫీసు వద్ద బాద్షా కి స్పెషల్ అడ్వాంటేజ్

Baadshah9
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటించిన ‘బాద్షా’ ఏప్రిల్ 5న విడుదలకానుంది. ఈ సినిమా నిన్న సెన్సార్ కార్యక్రమాలను ముగించుకుంది. సెన్సార్ వారు ఈ సినిమాకి యు/ఎ సర్టిఫికేట్ ను ఇచ్చారు. ఈ సినిమా చాలా బాగుందని, ఎన్.టి.ఆర్ ఈ సినిమాలో కనిపించే తీరు ఈ సినిమాకి ప్లస్ అని అందరు అనుకుంటున్నారు. ఎన్.టి.ఆర్ అద్భుతమైన నటన, శ్రీను వైట్ల కామెడీ టాలెంట్, ప్రస్తుతం బాక్స్ ఆఫీసు వద్ద సరైన హిట్ సినిమా లేకపోవడం,

గత కొద్ది వారల నుండి బాక్స్ ఆఫీసు వద్ద చిన్న సినిమాలు మాత్రమే విడుదల కావడం ఇలా అన్నీ సినిమాకి స్పెషల్ అడ్వాంటేజ్ గా మారాయి. ఈ సమ్మర్ లో వస్తున్న తొలి పెద్ద సినిమా కావడం మరో విశేషం. ఏప్రిల్ 3తో స్టూడెంట్స్ పరీక్షలు ముగియనుండడంతో వారు ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పరిస్థితులన్ని ఈ సినిమాకి అనుకూలంగా ఉన్నాయి. మరి ఈ సినిమా ఎన్.టి.ఆర్ కెరీర్లోనే ఒక బ్లాక్ బస్టర్ హిట్ కానుందా? అనేదాని కోసం మరొక మూడు రోజులు వేచి చూడాల్సిందే.

Exit mobile version