బాలుగారి హెల్త్ పై ఎస్పీ చరణ్ లేటెస్ట్ అప్ డేట్ !

లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చివరకు కరోనా వైరస్ ను జయించారు. ఎస్పీ చరణ్ తన తండ్రి హెల్త్ గురించి చెబుతూ.. ‘కోవిడ్ -19 టెస్ట్ లో బలుగారికి నెగెటివ్ వచ్చిందని… అయితే ప్రస్తుతం ఆయన లంగ్స్ కి సంబంధించిన అనారోగ్య సమస్య బాధ పడుతున్నారని.. ఆయన పూర్తిగా కోలుకోవాటానికి ఇంకా సమయం పడుతుందని ఎస్పీబీ కుమారుడు ఎస్పీ చరణ్ తాజా వీడియోలో వెల్లడించారు.

ఇక తమ అభిమాన గాయకుడు త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రార్ధనలు చేశారు, అలాగే తమిళ స్టార్లు రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ తో పాటు లెంజడరీ సంగీత దర్శకులు ఇళయరాజా, ఏఆర్‌ రహ్మాన్‌, సినీ గేయరచయిత వైరముత్తు సహా పలువురు సినీ ప్రముఖులు సామూహిక ప్రార్థనలను కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తానికి లక్షలాది అభిమానులు పూజలు ఫలించాయి. బాలుగారి కరోనాని జయించారు.

Exit mobile version