వెంకీ – మహేష్ బాబు అభిమానులే కాకుండా సాధారణ ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. ఫిలిం నగర్ వర్గాల తాజా సమాచారం ప్రకారం మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో మెలోడితో పాటుగా వెస్ట్రన్ బీట్స్ తో పాటలు ఉన్నాయని, సినిమాకి ఆడియో హైలెట్ అవుతుందని సమాచారం. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ లోని పాట అందరు వినే ఉంటారు. మిగతా పాటలు కూడా అంతే అధ్బుతంగా ఉన్నాయని యూనిట్ వర్గాలు కూడా ధృవీకరిస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాని మొదటగా సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేసినప్పటికీ నటీనటుల కాల్ షీట్స్ ఆలస్యం కావడం, షూటింగ్ వాయిదా పడటం వల్ల డిసెంబర్లో విడుదలయ్యే అవకశాలు ఉన్నాయి. తన మొదటి సినిమా ‘కొత్త బంగారు లోకం’ సినిమాతోనే అందరి దృష్టి తన మీద పడేలా చేసుకున్న దర్శకుడు శ్రీకాంత్ అద్దాల డైరెక్షన్లో వస్తున్న రెండవ సినిమా ఇదే కావడంతో అంచనాలు కూడా తార స్థాయిలో ఉన్నాయి. సమంతా, అంజలి కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జయసుధ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మనసుకు హత్తుకునే సంగీతంతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’
మనసుకు హత్తుకునే సంగీతంతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’
Published on Aug 28, 2012 8:19 AM IST
సంబంధిత సమాచారం
- ‘మిరాయ్’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. ఎపిక్ వరల్డ్ పరిచయం అప్పుడే..!
- ‘పెద్ది’ పై లేటెస్ట్ అప్డేట్!
- సమీక్ష: ‘సుందరకాండ’ – ఆకట్టుకునే రోమ్ కామ్ డ్రామా
- ‘మన శంకర వరప్రసాద్ గారు’.. కొత్త పోస్టర్ తో అదరగొట్టారు!
- ‘ఓజి’ నుంచి సువ్వి సువ్వి సాంగ్.. థమన్ నుంచి బ్యూటిఫుల్ బ్యాంగర్
- ఓటీటీలో పుష్ప 2 ని మించి ‘దేవర’?
- ‘ఓజి’ నెక్స్ట్ ట్రీట్ కోసం అంతా వెయిటింగ్!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘కింగ్డమ్’
- 2025 ఓవర్సీస్ మార్కెట్ లో ‘కూలీ’ లీడ్ లో ఉందా?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటీటీలో పుష్ప 2 ని మించి ‘దేవర’?
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- వీడియో : OG – సువ్వి సువ్వి లిరికల్ వీడియో (పవన్ కళ్యాణ్, సుజీత్)
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!