వరలక్ష్మీ పప్పుల సమర్పణలో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా భాను దర్శకత్వంలో రాబోతున్న సరికొత్త ప్రేమకథ చిత్రం ‘ప్రేమిస్తున్నా’. సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో-హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న నవంబర్ 7న థియేటర్స్ లో విడుదల కానుంది.
అయితే, మేకర్స్ ఈ సినిమా నుంచి ‘సోల్ ఆఫ్ ప్రేమిస్తున్నా’ గ్లింప్స్ రిలీజ్ చేశారు. 56 సెకెన్ల నిడివి ఉన్న ఈ కంటెంట్ యువతను విపరీతంగా ఆకట్టుకొంటోంది. సినిమా ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేశారు చిత్ర యూనిట్. ఇంటెన్స్ లవ్ స్టోరీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దర్శకుడు భాను ‘ప్రేమిస్తున్నా’ సినిమాను న్యూ ఏజ్డ్ లవ్ స్టోరీగా ఆడియన్స్ కు చూపించబోతున్నారు.
ఇక ఈ సందర్భంగా దర్శకుడు భాను మాట్లాడుతూ.. ‘అన్ కండీషనల్ లవ్ తో తెరకెక్కిన సినిమా ప్రేమిస్తున్నా. ఇప్పటివరకు తెలుగులో అంత అన్ కండీషనల్ లవ్ తో ఏ సినిమా రాలేదు. అద్భుతమైన పాటలు, పర్ఫార్మెన్స్ తో ఈ చిత్రం నవంబర్ 7న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తుందని ఆశిస్తున్నా.” అని అన్నారు.


