జంజీర్ రీమేక్ బృందంలో చేరిన సోనుసూద్


సోను సూద్ “దబాంగ్’ చిత్రంలో విలన్ పాత్ర పోషించినప్పటి నుండి అయన కెరీర్ ఊపందుకుంది. ఈ మధ్యనే ఆయన “మాగ్జిమం” చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు తెలుగులో ఆయన చివరగా “ఊ కొడతారా ఉలిక్కి పడతారా” మరియు “జులాయి” చిత్రాలలో కనిపించారు. తాజా సమాచారం ప్రకారం ఈ నటుడు రామ్ చరణ్ బాలివుడ్లో చేస్తున్న మొదటి చిత్రం “జంజీర్” రీమేక్లో నటించనున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సోను సూద్, రామ్ చరణ్ స్నేహితుడు “షేర్ ఖాన్” గా కనిపించనున్నారు. ఈ పాత్రకు గాను మొదట అర్జున్ రాంపాల్ ని అనుకున్నారు తరువాత కొద్ది రోజులు సంజయ్ దత్ పేరు కూడా వినిపించింది. కాని ఇద్దరు డేట్స్ కుదరక తప్పుకున్నారు. బాలివుడ్ సమాచారం ప్రకారం ఈ పాత్ర చెయ్యడానికి సోను సూద్ అంగీకరించినట్టు తెలుస్తుంది త్వరలోనే చిత్రీకరణలో పాల్గొననున్నారు. అపూర్వ లఖియ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ మరియు మహేష్ గిల్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం అమితాబ్ నటించిన “జంజీర్” చిత్రానికి రీమేక్ అన్న విషయం వీక్షకులకు విదితమే.

Exit mobile version