సోనూ సూద్ నటుడిగా కంటే ఒక మంచి వ్యక్తిగా బాగా పాపులర్ అయ్యారు. లాక్ డౌన్ టైంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి దేశం మొత్తం మాట్లాడుకుంది. పెద్ద పెద్ద వాళ్లంతా సోనూ మంచితనాన్ని పొగిడారు. దీంతో ఆయన పాపులారిటీ బాగా పెరిగింది. దీంతో ఆయనకు సినిమా ఆఫర్లు బాగా పెరిగాయి. కొందరు నిర్మాతలు ఆయన్ను హీరోగా పెట్టి సినిమా చేసే ప్రయత్నాలు కూడ చేస్తున్నారని టాక్ వచ్చింది. ఇక సపోర్టింగ్ రోల్స్ సంగతైతే చెప్పనక్కట్లేదు. ఇప్పటికే చాలా సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయట.
పాపులారిటీ పెరిగితే ఆటోమేటిక్ గా రెమ్యునరేషన్ కూడ పెరగడం మామూలే. అందుకే సోనూ తన పారితోషకాన్ని పెంచినట్టు తెలుస్తోంది. ఇంతకు ముందు సినిమాకు ఒకటిన్నర నుండి రెండు కోట్ల వరకూ ఛార్జ్ చేసే సోనూ ఇప్పుడు ఏకంగా మూడు కోట్లు అడుగుతున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. ఈ రెమ్యునరేషన్ విని కొందరు నిర్మాతలకు షాక్ తిన్నారట. సోనూ తమ సినిమాల్లో ఖచ్చితంగా ఉండాలని అనుకున్న నిర్మాతలైతే ఆ పెద్ద మొత్తాన్ని ఇవ్వడానికి ముందుకొస్తున్నా చిన్న, మధ్యస్థాయి ప్రొడ్యూజర్ల కొద్దిగా వెనక్కు తగ్గుతున్నారట.