‘ఆచార్య’ సెట్లో 100 స్మార్ట్ ఫోన్లు పంచిన సోనూ సూద్

‘ఆచార్య’ సెట్లో 100 స్మార్ట్ ఫోన్లు పంచిన సోనూ సూద్

Published on Jan 6, 2021 5:16 PM IST

సోనూ సూద్ సేవా కార్యక్రమాలు విషయంలో అస్సలు వెనక్కు తగ్గట్లేదు. ఆస్తులు తాకట్టు పెట్టి మరీ సహాయం చేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో కోట్లు వెచ్చించి కష్టాల్లో ఉన్న వేల మందిని ఆదుకున్న ఆయన లాక్ డౌన్ ముగిశాక కూడ వాటిని అలాగే కొనసాగిస్తున్నారు. షూటింగ్లకు వెళ్లిన ప్రతి చోటా సహాయం కోసం వస్తున్న వారికి లేదనకుండా చేయూతను అందిస్తున్నారు. పేదలకే కాదు తనతో పనిచేసే వారి కష్టాలను కూడ గుర్తించి తగిన సహాయం చేస్తున్నారు.

ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రంలో ఒక కీ రోల్ చేస్తున్నారు. షూటింగ్ జరుగుతుండగానే ఆయన సినిమా కోసం పనిచేస్తున్న 100 మంది వర్కర్లకు ఖరీదైన స్మార్ట్ ఫోన్లను బహుకరించారు. ప్రస్తుతం విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులే నడుస్తున్నాయి. ప్రతి ఇంట్లోనూ స్మార్ట్ ఫోన్ అనేది అత్యవసరం అయింది. అందుకే సోనూ సూద్ ‘ఆచార్య’ బృందానికి స్మార్ట్ ఫోన్లు అందించారు. ఇలా అడగకుండానే తమ అవసరాన్ని గుర్తించి సాయం చేసినందుకు సోనూ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు ‘ఆచార్య’ టీమ్.

తాజా వార్తలు