రాజమహేంద్రవరం : మే : 15
పరమాత్మ ప్రాభవాన్ని అత్యంత తేజోవంతంగా అందించడంలో మహామంత్రోద్యమాన్ని నిరాఘాటంగా కొనసాగిస్తూ తెలుగు ఆధ్యాత్మిక రచనల్లో, ప్రచురణల్లో మొదటి వరుసలో దూసుకుపోతున్న ప్రముఖ రచయిత, అసాధారణ ప్రతిభాశాలి , జ్ఞాన మహాయజ్ఞ కేంద్రం సంస్థాపకులు పురాణపండ శ్రీనివాస్ కి రాజమహేంద్రవరం ప్రజాప్రనిధుల అపూర్వ ఆత్మీయ పూర్వక అభినందన లభించడం ప్రత్యేక విశేషంగానే చెప్పాలి.
ఈ ఉదయం అకస్మాత్తుగా ఒక ప్రత్యేక కార్యక్రమం నిమిత్తం రాజమహేంద్రవరానికి చేరుకున్న పురాణపండ శ్రీనివాస్ ని ఆయన స్వగృహమైన భాగవతమందిరంలోని జ్ఞానమహాయజ్ఞకేంద్రం కార్యాలయంలో నగరప్రముఖులైన ప్రజాప్రనిధులు భారతీయ జనతాపార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, ఎం ఎల్ సి సోము వీర్రాజు, తిరుమల తిరుపతిదేవస్థానం పాలకమండలి సభ్యులు రౌతు సూర్యప్రకాశ రావు, వై.ఎస్సార్సీపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, గౌతమిఘాట్ దేవాలయాల సమాఖ్య అధ్యక్షులు తోట సుబ్బారావు తదితర ప్రముఖులు విడివిడిగా కలిసి శ్రీనివాస్ అపురూపూపమైన కృషిని అభినందించారు.
పరమ పావనమైన పుణ్యగ్రంధాల్ని అద్భుత తేజపుంజాలుగా ప్రచురిస్తూ , వొళ్ళు గగుర్పొడిచే ప్రసంగాలతో ఆకర్షిస్తూ గోదావరి జిల్లాలకు విశేష ఖ్యాతి తెచ్చిపెడుతున్న పురాణపండ శ్రీనివాస్ నిస్వార్ధంగా చేస్తున్న కృషి మామూలు విషయం కాదని వీరంతా అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
ఈ సందర్భంగా సోమువీర్రాజు మాట్లాడుతూ ఒక్కొక్క పుస్తకం ఒకొక్క సౌభాగ్య శ్రేయస్కరంగా సాక్షాత్కరిస్తోందని , శ్రీనివాస్ చేస్తున్న కృషికి తామెప్పుడూ అండగా ఉంటామని చెప్పారు.
జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూఇంతవరకూ ఇంత అందంగా , ఇంత నిస్వార్ధంగా అద్భుతగ్రంధాలను వెలువరిస్తున్న వ్యక్తులెవరూ లేరని, పురాణపండశ్రీనివాస్ ఎంతో మహా బృహత్కార్యాన్ని చేస్తున్నారని ప్రశంసించారు.
రౌతు సూర్య ప్రకాశరావు మాట్లాడుతూ తాత తండ్రులు అద్భుతాల్ని సృష్టిస్తే, వారి స్పూర్తితో పురాణపండశ్రీనివాస్మహాద్భుతాల్ని సృష్టించి ఆకట్టుకుంటున్నారని పేర్కొంటూ శ్రీనివాస్ కృషి అనన్యసామాన్యమైందని అభినందనలు వర్షించారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరికి తోట సుబ్బారావు
హనుమాన్ మహా గ్రంధాన్ని బహూకరించారు. శ్రీనివాస్ బుక్స్ లో ప్రభూతమైన కాంతి పవిత్రంగా దర్శనమిస్తుందని బుచ్చ్చయ్య చౌదరి అభినందించారు.
ఈ కార్యక్రమంలో చెన్నాప్రగడ శ్రీనివాస్ ( అహుజా బాబు ) తదితరులు పాల్గొన్నారు.