ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ ఇప్పుడు అంతర్జాతీయ సినిమా వేడుకలలో ప్రదర్శనకు నమోదు చేసుకుంది. కొన్ని రోజులక్రితం మన జక్కన్న ఈ సినిమా షాంగాయ్ చలనచిత్ర వేడుకలలో పనోరమా విభాగంలో మే 20న ప్రదర్శించనున్నరు అని తెలిపాడు. ఇది కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఫిలిం మార్కెట్ విభాగంలో కుడా చోటు సంపాదించుకుంది.
ఇప్పుడు రాజమౌళి మన ‘ఈగ’ మాద్రిడ్ లో జరగనున్న మాద్రిడ్ చలనచిత్ర వేడుకలలో నమోదు చేసుకుందని చేసుకుందని, అది జూలై మొదటి వారంలో స్పెయిన్ లో జరగనుందని తెలిపాడు. ఈ సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ చాయాగ్రహణం, ఉత్తమ స్వరకర్త, ఉత్తమ గ్రాఫిక్స్, ఉత్తమ సహాయనటుడు, ఉత్తమ ఎడిటర్ విభాగాలలో ఆరు నేషనల్ అవార్డులను గెలుచుకుంది. అంతర్జాతీయ శ్రేణిలో ఇన్ని విభాగాలలో అవార్డులు గెలుచుకున్న చాలా తక్కువ తెలుగు సినిమాలలో ఇది ఒకటి. ఇదేకాక ఈగ సినిమా సౌత్ కొరియాలోని పుంచొన్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో కుడా ప్రదర్శింపబడుతుంది