షూట్ ను పూర్తి చేసుకున్న “సోలో బ్రతుకే సో బెటర్”.!

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ చాలా కాలం వరుస పరాజయాల అనంతరం మళ్ళీ హిట్ల బాట పట్టాడు. చిత్ర లహరి, ప్రతిరోజూ పండగే హిట్లతో హ్యాట్రిక్ విజయం కోసం ఎదురు చూస్తూ తాను నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సోలో బ్రతుకే సో బెటర్” పైనే ఆశలు పెట్టుకున్నాడు. టీజర్ మరియు పాటలతో మంచి మంచి పాజిటివ్ వైబ్స్ నెలకొన్నాయి.

అయితే లాక్ డౌన్ వల్ల మిగిలి ఉన్న కాస్త షూట్ వర్క్ ను ఇప్పుడు పూర్తి చేసేసి ఇతర పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను మొదలు పెట్టినట్టుగా అధికారికంగా తెలియజేసారు. తగు జాగ్రత్తలు తీసుకుంటూ తమ చిత్రం షూట్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం అంత సరదా సరదాగా పూర్తయ్యిందని సాయి తేజ్ తెలిపి తమ యూనిట్ ఫోటో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

ఈ చిత్రంతో డెబ్యూ దర్శకునిగా సుబ్బు పరిచయం కానుండగా నభా నటేష్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version