బాలీవుడ్ టాలెంటెడ్ నటుడు విక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన సెన్సేషనల్ హిట్ చిత్రం “ఛావా” కోసం అందరికీ తెలిసిందే. అయితే విక్కీ కౌశల్ కెరీర్లోనే రికార్డు గ్రాసర్ గా నిలిచిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ 500 కోట్లకి పైగా వసూళ్లు అందుకుంది. అయితే ఈ చిత్రానికి తెలుగు ఆడియెన్స్ నుంచి కూడా విపరీతమైన డిమాండ్ నెలకొన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో గీతా ఆర్ట్స్ వారు ఈ చిత్రాన్ని రిలీజ్ కి తీసుకొచ్చారు. అయితే ఇంట్రెస్టింగ్ గా ఈ ఫ్రైడే రిలీజ్ లలో తెలుగు స్టేట్స్ లో ఛావా కి సాలిడ్ వెల్కమ్ దక్కినట్టుగా తెలుస్తుంది. డే 1 కి ప్రీబుకింగ్స్ బాగానే నమోదు కాగా రిలీజ్ రోజు కూడా హవర్లీ బుకింగ్స్ లో ఈ సినిమా ట్రెండింగ్ లో కొనసాగడం విశేషం. దీనితో “ఛావా”కి తెలుగులో కూడా మంచి ఓపెనింగ్స్ రావచ్చని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా మాడాక్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.