ఇండియన్ సినిమా నుంచి వచ్చిన భారీ హిట్ యానిమేషన్ చిత్రం ‘మహావతార్ నరసింహ’. దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం ఊహించని హిట్ గా నిలిచి రికార్డు వసూళ్లు సొంతం చేసుకుంది. ఇప్పుడు వరకు కూడా సాలిడ్ రన్ ని కొనసాగిస్తున్న ఈ సినిమా తర్వాత మరిన్ని క్రేజీ చిత్రాలు తమ యూనివర్స్ నుంచి వస్తున్నా సంగతి తెలిసిందే.
మరి నరసింహ సినిమా తర్వాత మేకర్స్ నుంచి నెక్స్ట్ చిత్రమే “మహావతార్ పరశురామ”. దీనిపై ఇప్పుడు భారీ అంచనాలు నెలకొనగా ఈ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతుండగా ఈ ఏడాది నవంబర్ నుంచి అసలు రంగంలోకి దిగబోతున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. దీనితో మహావతార్ పరశురామ ఆరంభం ఇంకొన్ని నెలల్లోనే ఉంటుందని చెప్పాలి. మరి ఈ పవర్ఫుల్ సబ్జెక్టు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.