మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ షో ఇప్పుడు నాలుగో సీజన్లో కూడా సూపర్బ్ గా రన్ అవుతుంది. గత మూడో సీజన్ ను అదిరిపోయేలా హోస్ట్ చేసిన కింగ్ నాగార్జునే ఈసారి కూడా హోస్ట్ చెయ్యడం మరోసారి షో కు మరింత బూస్టప్ ఇచ్చింది. ఈ షో మొదట్లో సో సో గానే అనిపించినా తర్వాత తర్వాత మాత్రం ఆడియెన్స్ కు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మేకర్స్ మేజర్ చేంజెస్ నే చేసారు.దీనితో వీక్ ఎపిసోడ్స్ కు కూడా మంచి టీఆర్పీ రావడం మొదలయ్యింది.
కానీ కొన్ని రోజుల కితం మాత్రం నాగ్ తన సినిమా షూట్ నిమిత్తం బయటకు వెళ్లగా ఆ ఎపిసోడ్ ను అక్కినేని కోడలు అక్కినేని సమంత గత వీకెండ్ ఎపిసోడ్ ను హోస్ట్ చేసింది. అయితే గ్రాండ్ గా ప్లాన్ చేసిన ఈ ఎపిసోడ్ కు గాను ఖచ్చితంగా మంచి టీఆర్పీనే వస్తుంది అంతా అనుకున్నారు. ఇప్పుడు అలా అనుకున్నట్టుగానే 11.4 గట్టి టీఆర్పీ రేటింగ్ పాయింట్స్ వచ్చాయి. మొత్తానికి మాత్రం మామయ్య ప్లేస్ లో వచ్చి స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ ను సమంత ఏ స్థాయిలో మెస్మరైజ్ చేసిందో ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని చెప్పాలి.