ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పలు ఆసక్తికర పాన్ ఇండియన్ ప్రాజెక్టులలో ముందు వరుసలో ఉన్న చిత్రం “రాధే శ్యామ్”. పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ భారీ పాన్ ఇండియన్ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
అయితే మరి ఈ సినిమా నుంచి ఎప్పటి నుంచో టీజర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి దీనిపై ఇప్పటికే టాక్ మొదలయ్యింది. వచ్చే కొత్త సంవత్సరం వేడుకకు గాని తర్వాత పొంగల్ కానుకగా కానీ దీనిని వదలనున్నట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇక ప్రభాస్ నుంచి ఇదే కాకుండా మరిన్ని ట్రీట్స్ కూడా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
ప్రభాస్, నాగశ్విన్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ నుంచి కూడా ఒక అప్డేట్ రావడం కన్ఫర్మ్ అయ్యింది మరి ఇదే బాటలో లేటెస్ట్ గా అనౌన్స్ చేసిన సాలిడ్ ప్రాజెక్ట్ “సలార్” నుంచి కూడా అప్డేట్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈ మూడు వచ్చినట్టయితే ప్రభాస్ ఫ్యాన్స్ కు గట్టి ట్రీట్ అనే చెప్పాలి.