భారీ రేటుకు అమ్ముడుపోయిన ఈగ సాటిలైట్ హక్కులు


అగ్ర దర్శకుడు రాజమౌళి అందించబోతున్న గ్రాఫిక్ అధ్బుతం ‘ఈగ’ విడుదలకి ముందే బిజినెస్ లో రికార్డులు సృష్టిస్తుంది. ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉండటంతో డిస్ట్రిబ్యూటర్స్ చాలా ఆసక్తి చూపిస్తున్నారు. మాకు తెలిసిన అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్ర సాటిలైట్ హక్కులు 5 కోట్ల 50 లక్షల వరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఒక అగ్ర హీరో సినిమా ఉండే బిజినెస్ ఈ చిత్రానికి ఉండటం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రాజమౌళి వల్లే ఇది సాధ్యమవుతుందని అర్ధమవుతుంది. ప్రస్తుతం ఈ చిత్రం చివరి దశ పనుల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మార్చి 22 న ఆడియో విడుదల కానున్న ఈ చిత్రంలో సమంతా హీరొయిన్ గా నటిస్తుండగా నాని మరియు ప్రముఖ కన్నడ నటుడు సుదీప్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version