పవన్ కళ్యాణ్ రోలెక్స్ వాచ్ గురించి ఇంత గొడవా ?

పవన్ కళ్యాణ్ రోలెక్స్ వాచ్ గురించి ఇంత గొడవా ?

Published on Nov 5, 2020 2:35 AM IST


పవన్ కళ్యాణ్ విషయంలో ప్రతి చిన్న అంశాన్నీ భూతద్దంలోంచి చూడటం నెటిజన్లకు బాగా అలవాటైపోయింది. ఈ కారణంగా లేనిపోని వివాదాలు తలెత్తుతున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగో పాల్గొంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో విడుదలయ్యాయి. షూట్ బ్రేక్లో పవన్ జనసేన పార్టీ పనులు చూసుకుంటూ కనిపించారు. అందరికీ పవన్ అటు సినిమాను, ఇటు పార్టీ పనులను చక్కబెట్టుకోవడం కనిపిస్తే కొందరు ఔత్సాహికులకు మాత్రం ఆయన చేతి గడియారం కనబడింది.

ఆ ఫోటోల్లో పవన్ లగ్జరీ రోలెక్స్ వాచ్ పెట్టుకుని ఉన్నారు. దీంతో వారు ఆ మోడల్ గురించి నెట్లో వెతికి మరీ వివరాలు బయటపెట్టారు. ఇండియన్ కరెన్సీలో ఆ వాచ్ ఖరీదు 40 లక్షల రూపాయల పైమాటే అంటూ వివరాలు అందించారు. అక్కణ్ణుంచి మొదలైంది వివాదం. పవన్ అంటే సింప్లిసిటీకి మారుపేరు. మామూలు సమయంలో ఆయన చేనేత బట్టలు కట్టుకుని చాలా సామాన్యుడిలా కనిపిస్తుంటారు. అలాంటి ఫోటోలు తరచూ సోషల్ మీడియాలో వస్తూనే ఉంటాయి.

ఇప్పుడు పవన్ అంత కాస్ట్లీ వాచ్ పెట్టుకుని కనిపించడంతో సింప్లిసిటీ ఏమైంది, ఆయన కూడ డబ్బున్న వాళ్ళలానే ఉంటారు అంటూ కామెంట్స్ మొదలయ్యాయి. దీంతో అభిమానులకు వారికి సోషల్ మీడియాలో వాగ్వాదం స్టార్ట్ అయింది. నిజానికి పవన్ ఆ ఖరీదైన చేతి గడియారాన్ని షూటింగ్ నిమిత్తమే పెట్టుకున్నారు. ‘వకీల్ సాబ్’ అఫీషియల్ పోస్టర్లలో కూడ అదే వాచ్ కనిపిస్తుంది. పెద్ద స్టార్ హీరోలు సినిమాల్లో ఖరీదైన యాక్ససిరీస్ వాడటం చాలా సాధారణమైన విషయం. అంతమాత్రం దానికే పవన్ వాచ్ గురించి కొందరు గొప్పలు చెప్పడం, వాటిని ఇంకొందరు విమర్శించడం కొంచెం కూడ అర్థంలేని పని.

తాజా వార్తలు