సమంత, శృతిహాసన్ ఫొటోల వెనుక పెద్ద కారణమే ఉంది

సమంత, శృతిహాసన్ ఫొటోల వెనుక పెద్ద కారణమే ఉంది

Published on Feb 4, 2020 10:31 PM IST

నిన్నటి నుండి సోషల్ మీడియా మొత్తం విఖ్యాత చిత్రకారుడు రవివర్మ గీసిన చిత్రాలను పోలిన సమంత, శృతిహాసన్, రమ్యకృష్ణ ఇంకా కొందరు నటీమణుల ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

ఫొటోలను చూసిన నెటిజన్లు రవివర్మ చిత్రాల్లోని నారీమణులే దిగివచ్చినట్టున్నారు అంటూ ప్రసంశలు కురిపిస్తున్నారు. ఈ ఫొటోలను ప్రముఖ ఫొటోగ్రాఫర్ జి.వెంకట్రామన్ తీశారు. ఇలా రవివర్మ పెయింటింగ్స్ థీమ్ వాడి ఫొటోలను తీసి 2020 క్యాలెండర్ ఒకదాన్ని రూపొందించారు.

ఇలా చేయడం వెనుక మంచి సోషల్ కాజ్ ఒకటుంది. సుహాసిని మణిరత్నం నామ్ ఆర్గనైజేషన్ పేరుతో ఒక స్వచ్చంధ సంస్థ నడుపుతున్నారు. దీనిద్వారా కష్టాల్లో ఉన్న ఒంటరి మహిళలకు చేయూతనిస్తుంటారు. సొంతగా బ్రతకడానికి కావలసిన నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి శిక్షణ ఇస్తుంటారు. ఈ ఆర్గనైజేషన్ కోసమే సమంత, శృతిహాసన్, ఐశ్వర్య రాజేష్, రమ్యకృష్ణ, ఖుష్బూ, శోభన, లిస్సి లక్ష్మి, మంచు లక్ష్మి లాంటి వారంతా తమ వంతు కృషిగా ఫొటోషూట్లో పాల్గొన్నారు.

తాజా వార్తలు