అక్కినేని నాగేశ్వర రావు విజయం వెనుక శ్రీమతి అన్నపూర్ణ పాత్ర


గత బుధవారం శ్రీమతి అన్నపూర్ణ గారు చనిపోవడంతో అక్కినేని కుటుంబం మరియు తెలుగు చలన చిత్ర పరిశ్రమ సినీ పెద్దను కోల్పోయింది. ఆవిడ తన కుటుంబానికి మాత్రమే సేవ చేయలేదు. అక్కినేని నాగేశ్వర రావు గారు ‘ప్రేమ్ నగర్’ సినిమాలో పాత్రని అంత బాగా చేయడానికి కారణం ఆవిడేనని కొంత మంది మాత్రమే తెలుసు. ప్రేమ్ నగర్ సినిమా ప్రారంభానికి ముందు నాగేశ్వర రావు గారు స్క్రిప్ట్ ఇంటికి తెచ్చుకుని చదివే వారు. అన్నపూర్ణ గారు కూడా ఆ స్క్రిప్ట్ చదివి ఇంప్రెస్ ఐపోయి నాగేశ్వర రావు పాత్ర బాగా చేసేలా ఎంతో సహకరించారు. ఆవిడ ‘ప్రేమాభిషేకం’ మ్యూజిక్ సిట్టింగ్స్లో కూడా పాల్గొన్నారు. నాగేశ్వర రావు గారి ఇంతటి విజయానికి ఆవిడ తోడ్పాటు ఎంతో ఉందని ఆ కుటుంబంతో దగ్గర సంబంధ ఉన్న కొందరికి మాత్రమే తెలుసు.

Exit mobile version