జనవరి 22న ఎస్సెమ్మెస్ ఆడియో


ఘట్టమనేని ఫ్యామిలీ నుండి మరో హీరో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ గారి అల్లుడైన సుదీర్ బాబు ‘ఎస్సెమ్మెస్’ (శివ మనసులో శృతి) చిత్రం ద్వారా ఘాట్టమనేని అభిమానులను అలరించబోతున్నాడు. సెల్వగణేష్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఈ నెల 22న శిల్ప కళా వేదికలో అభిమానుల సమక్షంలో విడుదల చేయబోతున్నారు. ఈ వేడుకకు ఘట్టమనేని కుటుంబ సభ్యులు సూపర్ స్టార్ కృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు హాజరు కాబోతున్నారు. గతంలో ‘భీమిలి కబడ్డీ జట్టు’ చిత్రాన్ని డైరెక్ట్ తాతినేని సత్య ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసారు. సుదీర్ బాబు సరసన రేగినా హీరోయిన్ గా నటించింది. తమిళ్లో వచ్చిన ‘శివ మనసుల శక్తి’ చిత్రానికి ఇది రిమేక్.

Exit mobile version