బిగ్ బ్యానర్ నుండి చిన్న సినిమాలు !

యూవీ క్రియేష‌న్స్ అనే బ్యానర్ కి భారీ సినిమాల ‘సినిమా సంస్థ’గా మంచి నేమ్ ఉంది. ప్రస్తుతం రాథేశ్వామ్ నిర్మాణంలో ఉన్నప్పటికీ.. ఆ సినిమా తప్ప ఇంతవరకూ మరో భారీ సినిమాని సెట్ చేసుకోలేదు యూవీ క్రియేష‌న్స్. అందుకే యూవీ ఇక నుండి వరుసగా వెబ్ సిరీస్ లను అండ్ చిన్న సినిమాల మీద దృష్టి పెడుతోందట. ఇప్పటికే కొత్త డైరక్టర్లను కొంతమందిని రెడీ చేసినట్లు తెలుస్తోంది.

ప్రముఖ డైరెక్టర్ క్రిష్ దగ్గర అసోసియేట్ గా పని చేస్తోన్న భార్గవ్ అనే వ్యక్తిని ఇప్పటికే డైరెక్టర్ గా పరిచయం చేయడానికి రంగం సిద్ధం అయింది. నిజానికి కొత్త డైరెక్టర్లను పరిచయం చేస్తూ చిన్న చిత్రాలు చేసే కంటే కూడా, మారుతి లాంటి డైరెక్టర్ డైరక్షన్ లో నాని లాంటి హీరోను పెట్టి సినిమాని చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. అయితే ఇండస్ట్రీలో కొత్త డైరెక్టర్లు రావాలని.. అది తమ సంస్థ ద్వారే రావాలని యూవీ సంస్థ ప్లాన్ చేస్తోందట.

Exit mobile version