ఈ చిత్రంతో నా కెరీర్ గొప్ప మలుపు తిరుగుతుంది

ఈ చిత్రంతో నా కెరీర్ గొప్ప మలుపు తిరుగుతుంది

Published on Jul 16, 2012 12:19 PM IST


ప్రస్తుతం కథానాయికలు తమ సొంత భాషలో కంటే ముందు ఇతర భాషలలో తమ సత్తా చాటుకొని తర్వాత తమ సొంత భాషలో అవకాశాలు దక్కించుకుంటున్నారు. మిస్ బెంగుళూరు పూనమ్ కౌర్ కూడా ఇదే బాటలో వెళ్తోంది. హైదరాబాద్లో పెరిగిన ఈ తెలుగు భామ తెలుగులో సినిమాలు చేసినప్పటికీ తగినత గుర్తింపు రాకపోవడంతో పూనమ్ తమిళ చిత్ర సీమపై కన్నేశారు. ఇప్పటికే నలుగు తమిళ సినిమాలు చేసిన ఈ భామ ప్రస్తుతం శింబు సరసన ఒక సినిమా, ‘వాదం’ అనే సినిమా మరియు ‘కిక్’ శ్యాం హీరోగా తెరకెక్కుతున్న ‘6’ చిత్రాల్లో నటిస్తోంది.

పూనమ్ కౌర్ ‘6’ చిత్రంలో తన పాత్ర గురించి మాట్లాడుతూ ” ‘6’ చిత్రాన్ని దర్శకుడు దొరై చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం నా కెరీర్లోనే ఒక స్పెషల్ సినిమా అవుతుంది మరియు ఈ చిత్రంతో నా కెరీర్ గొప్ప మలుపు తిరుగుతుంది. దర్శకుడు నా పాత్రని చాలా బాగా తీర్చిదిద్దారు. ఈ చిత్రంలో ‘కిక్’ శ్యామ్ 6 విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తారు, ఆయన ఆరు పాత్రలకి ఏ మాత్రం తగ్గకుండా తన పాత్ర ఉంటుందన్నారు. ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాదిస్తుందని నమ్మకం ఉంది. అలాగే ఈ చిత్ర షూటింగ్ కోసం అవుట్ డోర్ వెళ్ళినప్పుడు ప్రేక్షకులు నాపై ఎనలేని అభిమానాన్ని చూపించడమే కాకుండా మీరు చాలా సన్నగా ఉన్నారు కొంచెం బొద్దుగా అవ్వండి అని సలహాలు కూడా ఇచ్చారని” అన్నారు.

తాజా వార్తలు