సమీక్ష: ‘మదరాసి’ – అక్కడక్కడా ఓకే అనిపించే యాక్షన్ డ్రామా

madharaasi

విడుదల తేదీ : సెప్టెంబర్ 5, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : శివ కార్తికేయన్, రుక్మిణి వసంత్, విద్యుత్ జమ్వాల్, షబీర్, బిజూ మీనన్ తదితరులు
దర్శకుడు : ఎ ఆర్ మురుగదాస్
నిర్మాతలు : శ్రీ లక్ష్మీ మూవీస్
సంగీత దర్శకుడు : అనిరుద్ రవిచందర్
సినిమాటోగ్రాఫర్ : సుదీప్ ఎలమన్
ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో కోలీవుడ్ అవైటెడ్ చిత్రం ‘మదరాసి’ కూడా ఒకటి. శివకార్తికేయన్ హీరోగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

తన చిన్నతనంలోనే ఒక యాక్సిడెంట్ లో కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకున్న రఘు (శివ కార్తికేయన్) ఆ ఘటనతో డిల్యూషన్ సిండ్రోమ్ కి గురవుతాడు. ఇలా 16 ఏళ్ళు ట్రీట్మెంట్ తర్వాత తన లైఫ్ లోకి మాలతి (రుక్మిణి వసంత్) వస్తుంది. ఇంకో పక్క ఇద్దరు ఫ్రెండ్స్ చిరాగ్ (షబీర్), విరాట్ (విద్యుత్ జమ్వాల్) లు మొత్తం చెన్నైని గన్స్ తో నింపాలని పెద్ద ప్లాన్ చేస్తారు. ఇది ఎన్ ఐ ఏ వారికి పెద్ద సవాలుగా మారుతుంది. ఇలా ఎన్ ఐ ఏ అధికారి ప్రేమ్ (బిజూ మీనన్) తన బృందంతో ఆ గన్ కల్చర్ ని ఆపాలని ట్రై చేసే మిషన్ లోకి రఘు ఎలా ఎంటర్ అయ్యాడు? తన ప్రేయసి కోసం రఘు ఏమేం చేసాడు? ఈ గన్ మాఫియా వెనుక ఉన్నది ఎవరు? ఆ గన్ లోడ్ బయటకి రాకుండా ఆపారా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో బాగా ఇంప్రెస్ చేసే అంశాల్లో హీరో శివ కార్తికేయన్ కోసం మొదటిగా చెప్పుకోవాలి. తను అమరన్ లాంటి బిగ్ హిట్ తర్వాత ఇలాంటి ఒక ఊహించని పాత్రని ఎంచుకోవడం ఒకింత ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

ఇది వరకు వచ్చిన సినిమాలు అన్నిటికంటే బహుశా రెమో తర్వాత నటుడుగా తన నుంచి ఒక సాలిడ్ రోల్ ఇది అని చెప్పొచ్చు. నటుడిగా ఈ సినిమాలో కొత్త వెర్షన్ ని తన నుంచి చూడవచ్చు. అలాగే తనపై ఫస్టాఫ్ లో ఎమోషన్స్ కానీ ఫుల్ మూవీ లో యాక్షన్ పార్ట్ కాని సాలిడ్ గా వర్కౌట్ అయ్యాయి.

ఇక తనతో పాటుగా విద్యుత్ కి సాలిడ్ రోల్ దక్కింది. మొదట్లో కొంచెం సోసో గానే అనిపిస్తుంది కానీ సెకాండఫ్ లో మాత్రం మురుగదాస్ మళ్లీ తుపాకీ రేంజ్ ఫీస్ట్ తనపై అందించాడు. విద్యుత్ రోల్ కోలుకున్న తర్వాత నుంచి సినిమా మూమెంటం మారింది.

ఇక వీరితో పాటుగా డాన్సింగ్ రోజ్ ఫేమ్ షబీర్ కి మంచి పాత్ర దక్కింది. తన నటనా యాక్షన్ పెర్ఫామెన్స్ లు బాగున్నాయి. అలాగే హీరోయిన్ రుక్మిణీ వసంత్ కి సినిమాలో మంచి రోల్ దక్కింది. దాదాపు తనకోసమే అన్నట్టు సినిమా కూడా ఉంటుంది. తన రోల్ కి ఆమె న్యాయం చేసింది. ఇక వీరితో పాటుగా బిజూ మీనన్, పి సీ 2 గా కనిపించిన నటుడు తదితర ప్రధాన తారాగణం బాగా నటించారు.

మైనస్ పాయింట్స్:

మురుగదాస్ నుంచి చాలా కాలం తర్వాత వచ్చిన సినిమా ఇది అయినప్పటికీ తన వంతు కొత్తగా అన్నట్టు ఏదో ట్రై చేశారు కానీ అదేమీ అంత కొత్తగా కనిపించదు. ఈ మధ్య కాలంలో పలు సినిమాల్లో చూపిస్తున్న గన్ కల్చర్ కాన్సెప్ట్ కి తన స్టైల్ హీరో పాత్ర దానికో లోపం పెట్టి అక్కడక్కడా తన పాత సినిమాలు స్టైల్ లోనే కథనం నడిపించారు.

అలాగే యాక్షన్, ఎమోషనల్ పార్ట్ కూడా కొంత మేరకు ఓకే అనిపిస్తుంది ఫుల్ ఫ్లెడ్జ్ గా ఆకట్టుకోలేదు. కొన్ని చోట్ల ఇవి ఫోర్స్డ్ గా కొన్ని చోట్ల నాచురల్ గా అనిపిస్తాయి. సో వీటితో తన నుంచి సాలిడ్ ట్రీట్ ని ఆశించే వారికి కొంచెం మిక్స్డ్ ఫీల్ కలుగుతుంది.

అలాగే సెకాండఫ్ లో కథనం కూడా అంత ఎంగేజింగ్ గా సాగలేదు. దాదాపు 40 నిమిషాల వరకు కథనం రెగ్యులర్ గా సాగుతుంది. సో ఇక్కడ సాగదీత ఫీల్ కలుగుతుంది. అలాగే పాటలు కూడా ఒకటీ రెండు తప్ప అంత ఇంప్రెసివ్ గా లేవు పైగా ఎక్కువగా కూడా ఉన్నట్లు అనిపిస్తాయి.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా కోసం ఖర్చు పెట్టారు. అనిరుద్ సంగీతం మరీ కాదు కాని కానీ బానే ఉంది. సెకాండఫ్ లో కొన్ని సీన్స్ కి మంచి స్కోర్ ఇచ్చాడు. సుదీప్ ఎలమన్ ఇచ్చిన కెమెరా వర్క్ బాగుంది. కెవిన్ కుమార్ యాక్షన్ పార్ట్ ఇంప్రెస్ చేస్తుంది. తెలుగు డబ్బింగ్ కూడా డీసెంట్ గా ఉంది.

ఇక దర్శకుడు ఎ ఆర్ మురుగదాస్ విషయానికి వస్తే.. తన వర్క్ అంచనాలు అందుకునే రీతిలో లేదని చెప్పక తప్పదు. ఈ మధ్య కాలంలో స్టార్ట్ అయ్యిన గన్ కల్చర్ కాన్సెప్ట్ తీసుకొని హీరోకి ఒక లోపాన్ని పెట్టి లవ్, యాక్షన్ మిక్స్ చేసి ప్లాన్ చేసిన ఈ సినిమా ఫుల్ ఫ్లెడ్జ్ గా తన మార్క్ లో సాగలేదు. కొన్ని చోట్ల ఇంప్రెస్ చేస్తే కొన్ని చోట్ల కథనం ఫోర్స్డ్ గా సాగుతుంది. అలాగే సినిమాకి మదరాసి అనే టైటిల్ ఎందుకు పెట్టారో తనకే తెలియాల్సి ఉంది. ఓవరాల్ గా తన ఫుల్ ఫ్లెడ్జ్ కంబ్యాక్ అయితే ఇంకా తర్వాతే చూడాలి.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘మదరాసి’ సినిమాలో శివ కార్తికేయన్ సాలిడ్ రోల్ తో ఇంప్రెస్ చేస్తాడు. తనపై యాక్షన్ పలు ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. అలాగే విద్యుత్ జమ్వాల్ కూడా అదరగొట్టాడు. అయితే కొన్ని చోట్ల వరకు కథనం ఓకే కానీ మిగతా కొంతమేర మాత్రం సోసో గానే అనిపిస్తుంది. వీటితో ఈ సినిమాని ఈ వీకెండ్ కి ప్లాన్ చేసుకుంటే మాత్రం కొంచెం తక్కువ అంచనాలే పెట్టుకోండి.

 

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

Exit mobile version