హిట్ కాంబినేషన్లో సాయిరామ్ శంకర్ మరో సినిమా

హిట్ కాంబినేషన్లో సాయిరామ్ శంకర్ మరో సినిమా

Published on Aug 31, 2012 8:15 PM IST


సాయిరామ్ శంకర్ మరియు పూరి జగన్నాథ్ శిష్యుడు జయ రవీంద్ర దర్శకత్వంలో 2009లో వచ్చిన ‘బంపర్ ఆఫర్’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే హిట్ కాంబినేషన్లో ఓ చిత్రం ప్రారంభం కానుంది. కె.వి.వి సత్యనారాయణ సమర్పణలో సౌదామిని క్రియేషన్స్ పతాకం పై కె. వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కథా చర్చలు చివరి దశలో ఉన్న ఈ చిత్రం పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా తెలియజేయనున్నారు. ప్రస్తుతం సాయిరామ్ శంకర్ రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అందులో ఒకటి రొమాంటిక్ లవ్ స్టొరీ ‘రోమియో’ మూవీ, రెండవది శ్రీహరి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ మూవీ ‘యమహో యమః’. ఈ రెండు చిత్రాల చిత్రీకరణ పూర్తయిన తర్వాత సాయిరామ్ శంకర్ కొత్త మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

తాజా వార్తలు