త్వరలో పెళ్ళి పీటలు ఎక్కనున్న గీతా మాధురి

Geetha-Madhuri

ప్రముఖ గాయని గీతా మాధురి – యాక్టర్ ఆనంద కృష్ణ నందుని వివాహం చేసుకోనుంది. గత కొద్ది రోజులుగా వీరిద్దరి మద్య స్నేహం వుంది. ఇప్పుడు వీరి కుటుంబ సభ్యులు కూడా ఈ వివాహానికి అంగీకరించారు. గీతా మాధురి మంచి ఎనర్జిటిక్ వాయిస్ ఉన్న సింగర్. ‘నచ్చావులే’ సినిమాలో ఆమె పాడిన ‘నిన్నే నిన్నే’ పాటకి 2008లో నంది అవార్డ్ వచ్చింది. అలాగే ఆనంద కృష్ణ నందు నాగ చైతన్య నటించిన ‘100% లవ్’ సినిమాలో నటించాడు.

ఈ సందర్బంగా 123తెలుగు.కామ్ తరువున గీత మాధురికి , ఆనంద కృష్ణ నందుకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

Exit mobile version