26న రానున్న వెల్ కమ్ ఒబామా ఆడియో

Welcome-Obama
‘పుష్పక విమానం’, ‘అపూర్వ సహోదరులు’, ‘భైరవద్వీపం’, ‘ ఆదిత్య 369’ లాంటి విభిన్న చిత్రాలను తీసిన సింగీతం శ్రీనివాసరావు ఏ మాత్రం విరామం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆయన తాజాగా దర్శకత్వం వహించిన సినిమా ‘వెల్ కమ్ ఒబామా’. షూటింగ్ మొత్తం పూర్తైన ఈ మూవీ ఆడియోని ఈ నెల 26న విడుదల చేయనున్నారు. ఇది మరాఠీలో అవార్డులు గెలుచుకున్న ‘మల ఐ వహయ్చి’ సినిమాకి రీమక్. తెలుగు వారికి తగ్గట్టుగా కథలో చాలా మార్పులు చేసారు.

ఈ సినిమాలో రేచల్, ఊర్మిళ, సంజీవ్, నిరంజని అనే కొత్త వాళ్ళు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. వాళ్ళు కొత్త వాళ్ళు అయినప్పటికే పెర్ఫార్మన్స్ బాగా చేసారని సింగీతం శ్రీనివాసరావు చాలా హ్యాపీ గా ఉన్నాడు. సాండిల్ వుడ్ మీడియా బ్యానర్ పై భారతి కృష్ణ ఈ సినిమాని నిర్మించాడు. ఈ సినిమా పూర్తి చేసిన సింగీతం ప్రస్తుతం మ్యూజిక్ ప్రధానాంశంగా సాగే ఓ సినిమాని తెరకెక్కించే పనిలో ఉన్నాడు.

Exit mobile version