నాని ‘ఆహా కళ్యాణం’ తో సిమ్రాన్ తిరిగి సినిమాల్లోకి రానుంది. వెడ్డింగ్ ప్లానర్ రోల్ చేస్తున్న సిమ్రాన్ ఐదు సంవత్సరాలలో మొదటి సారిగా నటించనుంది. చివరి సారిగా గౌతం మీనన్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ ఓ నటించిన సిమ్రాన్ తన సమయం మొతాన్ని కుటుంబానికి కేటాయించింది.
ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో తను 2014 ఓ ఒక చిత్రం నిర్మించనున్నానని తెలిపింది. అంతేకాకుండా భవిష్యతు లో మరిన్ని చిత్రాల్లో నటించాలని వుందని తెలిపింది. కొత్త హీరోయిన్ లలో తనకి ఎవరు ఇష్టం అని అడగగా “హన్సిక లో మంచి నటికి కావాల్సిన అన్ని లక్షణాలు వున్నాయి. అందంగా వుంటుంది, డాన్సు కూడా బాగా చేస్తుంది” అని తెలిపారు.
సిమ్రాన్ హీరోయిన్ గా నటించే కాలంలో తను తెలుగు మరియు తమిళ చాలా మంచి డాన్సర్. సిమ్రాన్ దగ్గర్నుంచి వచ్చిన ఈ పొగడ్త వల్ల హన్సిక చాలా గర్వం గా భావించొచ్చు. ప్రస్తుతం హన్సిక అమెరికా లో న్యూ ఇయర్ జరుపుకోవడానికి వెళ్ళింది. తిరిగి రాగానే తనకి తెలుగు మరియు తమిళ సీమలో బిజీ కానుంది. రవి తేజ తాజా చిత్రం లో హన్సికే హీరోయిన్ కాగా తన తదుపరి చిత్రం పాండవులు పాండవులు తుమ్మెద జనవరి 31 న విడుదల కానుంది.