కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సిద్ధార్ద్ హీరోగా నటిస్తున్న సినిమా ప్రారంభమయ్యింది. గతయేడాది కార్తీక్ సుబ్బరాజ్ తీసిన ‘పిజ్జా’ తమిళంలో సంచలనమైన విజయంసాధించింది. ఈ సినిమా తెలుగులోకి కుడా అనువాదమయ్యింది. ఈ దర్శకుడి ప్రతిభను చూసిన సిద్ధార్ద్ ఆయన రెండవ సినిమాలో హీరోగా నటిస్తానని తెలిపాడు. ఇది కామెడి థ్రిల్లర్ తరహాలో ఉండనుంది. ఈ సినిమా పేరు ‘జిగార్తండ’ అని దర్శకుడు తెలిపాడు. ఇది మదురైలో ఒక ప్రముఖ కూల్ డ్రింక్ పేరు. ఈ సినిమా షూటింగ్ ఈరోజు మదురైలో మొదలైంది. సిద్ధార్ద్ కు జోడిగా లక్ష్మీ మీనన్ నటిస్తుంది. కాతిరీసన్ ఈ సినిమాకు నిర్మాత. సంతోష్ నారాయణ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ సినిమా తమిళ మరియు తెలుగు భాషలలో విడుదలకానుంది