దుబాయ్ వెళ్లనున్న సిద్దార్ద్, తాప్సీ

siddharth-and-tapsee
సిద్దార్ద్ మరియు తాప్సీ తమ తాజా సినిమా ‘చష్మే బదూర్’ వరల్డ్ ప్రీమియర్లో ప్రదర్శించడానికి దుబాయ్ వెళ్లనున్నారు. డేవిడ్ ధావన్ సినిమా దర్శకుడు. 1981లో వచ్చిన చిత్రానికి ఇది అదే పేరుతో రీమేక్ అయ్యింది. ఈ సినిమాలో మొదటిసారిగా బాలీవుడ్ జనాలకి కనబడడానికి తాప్సీ కొన్ని వారాలుగా ఎదురుచూస్తుంది. దేశమంతా ఈ సినిమా గురించి ప్రచారం చేస్తున్నారు.”నేను నా మొదటి హిందీ సినిమాలో కనపడటానికి చాలా ఉద్వేగానికి లోనవుతున్నాను. నేను తమిళ్ , తెలుగు లో నటించాను అని తెలుసు కనుక నా మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇది అంత తేలికైనా పని కాదని ” తాప్సీ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.

ఇదిలా ఉండగా సిద్దార్ద్ ఈరోజు ‘ఎన్. హెచ్ 4′ ఆడియో లాంచ్ కి హైదరాబాద్ వచ్చాడు. మనిమారన్ దర్శకుడు. వెట్రిమారన్ స్క్రిప్ట్ అందించాడు. ఆంధ్రాలో లక్ష్మి గణపతి ఫిల్మ్స్ ద్వారా తమిళ్ లో ఉదయనిది స్టాలిన్ ద్వారా విడుదలకానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో అర్షిత శెట్టి హీరొయిన్. ఈ ఆడియో లాంచ్ కి గుణశేఖర్, జి.వి ప్రకాష్, మారుతీ మరియు రమేష్ పుప్పాల ముఖ్య అతిధులుగా ఎఫ్.ఎం స్టూడియోలో హాజరయ్యారు

Exit mobile version