త్వరలో దుబాయ్ వెళ్తున్న సిద్దార్థ్ – సమంత


‘అలా మొదలైంది’ లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత నందిని రెడ్డి దర్శకత్వంలో సిద్దార్థ్ మరియు సమంత హీరో హీరోయిన్లుగా ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్ర యూనిట్ కొత్త షెడ్యూల్ కోసం ఈ నెల 19న దుబాయ్ వెళ్లనున్నారు. ఈ షెడ్యూల్లో ఒక పాటను మరియు కొంత టాకీ పార్ట్ ను చిత్రీకరించనున్నారు.

ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతున్న ఈ చిత్రం ఈ సంవత్సరం చివరికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version