చిత్రం వెనక పేరున్న నిర్మాత లేకపోతే తెలుగు చిత్రాన్ని విడుదల చెయ్యటం చాలా కష్టం ఇదే విషయాన్నీ పలువురు చిన్న నిర్మాతలు తెర మీదకి తీసుకురావాలని ప్రయత్నించారు. ఈ విషయం గురించి మాట్లాడిన తాజా నిర్మాత, నటుడు సిద్దార్థ్. ఈ మధ్యనే విడుదలయిన “లవ్ ఫెయిల్యూర్” చిత్రానికి ఈయన నిర్మాత ఈయన ఈ చిత్రాన్ని బెల్లం కొండ సురేష్ తో కలిసి పంపిణి చేశారు. అయన అనుభవాల గురించి చెప్తూ ” మన చిన్న తనంలో ఒకేసారి నాలుగైదు చిత్రాలు విడుదలయ్యేవి అవి బాగుంటే వాటిని ఆదరించేవారు ఇపుడు ఒకే ఒక్క చిత్రం విడుదలవుతుంది డిస్ట్రి బ్యుషన్ రంగంలో ప్రతి నియమాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఈ కారణంగా ఎన్నో చిత్రాలు విడుదల కాకుండా నిలిచిపోతున్నాయి ఆ దర్శకులను చూసినప్పుడు చాలా బాధేస్తుంది” అని ట్విట్టర్లో అన్నారు. సిద్దార్థ్ “లవ్ ఫెయిల్యూర్” చిత్రం ద్వారా ఏటకి ఎంటర్ టైన్మెంట్ అనే సంస్థను స్థాపించారు. ఈ చిత్ర తెలుగు వెర్షన్ దాదాపుగా ఏడు కోట్లు వసూలు చేసింది తమిళ వెర్షన్ ఆరు కోట్ల వరకు వసూలు చేసింది. చూస్తుంటే సిద్దార్థ్ ట్రేడ్ ట్రిక్స్ ని త్వరగా నేర్చుకుంటున్నట్టు తెలుస్తుంది. తన తరువాత చిత్రం ఎటువంటిది అయుంటుందని మేము వేచి చూస్తున్నాం.