సిద్దార్థ్ కి సెప్టెంబర్ నెల చాలా ప్రత్యేకమైనది.!

సిద్దార్థ్ కి సెప్టెంబర్ నెల చాలా ప్రత్యేకమైనది.!

Published on Aug 18, 2012 4:05 AM IST


చాలా కాలంగా షూటింగ్ లకు దూరంగా ఉన్న సిద్దార్థ్ మళ్ళీ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం సిద్దార్థ్ నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా మరియు వెట్రిమారన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఒక సినిమాలో నటిస్తున్నారు. ‘ చాలా రోజుల తర్వాత వెట్రిమారన్ మరియు మనికందన్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాను. ఇక రెండు వారాలు ఏకదాటిగా షూటింగ్ చేయనున్నామని’ సిద్దార్థ్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. సిద్దార్థ్ చేస్తున్న మొట్ట మొదటి యాక్షన్ చిత్రం ఇది మరియు ఈ చిత్రానికి మనికందన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఎక్కువ భాగం చిత్రీకరణ బెంగుళూరు నుండి చెన్నై మధ్యలో ఉన్న హైవేలో జరగనుంది. చివరి సారిగా సిద్దార్థ్ ‘లవ్ ఫెయిల్యూర్’ చిత్రంలో కనిపించారు మరియు ఈయనే ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం విజయం సాదించి కలెక్షన్లు బాగా రావడంతో ప్రస్తుతం ఆయన మరో రెండు సినిమాలను నిర్మిస్తున్నారు. ‘ సిద్దార్థ్ కెరీర్లో సెప్టెంబర్ నెల చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన నటించిన ‘మిడ్ నైట్ చిల్డ్రన్’ చిత్రం టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించనున్నారు మరియు ఈ ప్రీమియర్ షో కి ఈ చిత్ర టీంతో కలిసి సిద్దార్థ్ కూడా హాజరు కానున్నారు’. సమంత కూడా షూటింగ్ లలో పాల్గొంటోంది కనుక నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సినిమా కూడా ఇక ఆలస్యం కాకుండా చిత్రీకరణ జరుపుకుంటుందని చిత్ర వర్గాలు అనుకుంటున్నారు.

తాజా వార్తలు