ఐదు సినిమాలతో ముస్తాబవుతున్న సిద్ధార్ద్

Siddharth
తెలుగు తెరపైకి ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి ఘనవిజయం సాధించిన సినిమాతో పరిచయమై ఆ తరువాత ‘బొమ్మరిల్లు’ సినిమాతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న నటుడు సిద్ధార్ధ్. కాకపోతే ఆ తరువాత నుండి తన కెరీర్ లో అంతగా చెప్పుకునే సినిమాలు రాలేదు. ఈ యేడాది తను తెలుగులో నటించిన సినిమా ‘జబర్దస్త్’ నిరాశపరిచింది. కాకపోతే ఈ సినిమా ఫలితం మన రొమాంటిక్ హీరోను ఏమాత్రం కలవరపెట్టలేదు. ప్రస్తుతం సిద్ధార్ధ్ నటిస్తున్న 5 సినిమాలు వివిధ దశలలో రూపుదిద్దుకుంటున్నాయి. వీటిలో కొన్ని ద్విభాషా చిత్రాలుకాగా మరికొన్ని తెలుగులోకి అనువాదంకానున్నాయి

సిద్ధార్ద్ తన అభిమానులకు 2014లో తప్పకుండా తనలో కలిగిన మార్పును చూపిస్తానని చెప్తున్నాడు. చూద్దాం మనవాడి జాతకం భవిష్యత్తులో ఎలా వుండనుందో..

Exit mobile version