బాద్షాకి డబ్బింగ్ చెప్పిన సిద్దార్థ్

NTR-Siddharth

యంగ్ టైగర్ ఎన్.టి.అర్ ‘బాద్షా’ సినిమాలో హీరో సిద్దార్థ్ అతిధి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో నటించిన సిద్దార్థ్ సీన్స్ కి డబ్బింగ్ చెప్పడం పూర్తైంది. చివరిదశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ ని మార్చ్10లోపు కంప్లీట్ చేయనున్నారు. ఈ సినిమా ఆడియోని కూడా అదే రోజు అనగా మార్చ్ 10న, సినిమాని ఏప్రిల్ 5న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలోఎన్.టి.అర్ స్టైలిష్ గా సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మంచి కామెడీతో ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Exit mobile version