అలా మొదలైంది సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి మరో సినిమాతో రెడీ అయిపోయింది. మొదటి సినిమాలో నాని, నిత్య మీనన్ పై క్యూట్ లవ్ స్టొరీ తీసిన నందిని రెడ్డి ఇప్పుడు జబర్దస్త్ అంటుంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి తెలుగులో జబర్దస్త్ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ టైటిల్ గురించి అధికారికంగా ద్రువీకరించానప్పటికీ తమిళ్ టైటిల్ మాత్రం ‘డుం డుం పీ పీ’ అని ఖరారు చేసినట్లు సమాచారం. సిద్ధార్థ్ ఈ సినిమాలో మాస్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడని సమాచారం. తెలుగులో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ సినిమాని తమిళ్లో లింగు స్వామి బ్రదర్స్ పంపిణీ చేయనున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీత దర్శకుడు.