రామ్ – బొమ్మరిల్లు భాస్కర్ సినిమా కోసం కొత్త హీరోయిన్ ఎంపిక

రామ్ – బొమ్మరిల్లు భాస్కర్ సినిమా కోసం కొత్త హీరోయిన్ ఎంపిక

Published on Sep 7, 2012 11:51 AM IST


రామ్ – బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో రామ్ సరసన నటించేందుకు మొదటగా శుభా ఫుటేల అనే తమిళ హీరొయిన్ ను తీసుకున్నారు. అయితే గుంటూరు మిర్చి యార్డ్లో చేసింగ్ సీన్స్ షూటింగ్ చేస్తున్న సమయంలో మిర్చి ఘాటు వాళ్ళ శుభా ఫుటేల అనారోగ్యంకి గురవడంతో డాక్టర్లు ఆమెని విశ్రాంతి తీసుకోవాలని కోరగా ఆమె స్థానంలో నికిత బియ అనే కొత్త అమ్మాయిని తీసుకున్నట్లు యూనిట్ వర్గాల సమాచారం. శ్రీ వెంకటేశ్వర సిని చిత్ర బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ సినిమాని రిలయన్స్ సంస్థ వారితో కలిపి నిర్మిస్తున్నారు. జివి ప్రకాష్ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తణుకు ప్రాంతంలో షూటింగ్ జరుగుతుంది.

తాజా వార్తలు