ఎన్టీఆర్ 30వ చిత్రం త్రివిక్రమ్ తో కమిట్ కాగా ఈ చిత్రంలో ఆయన పక్కన నటించే హీరోయిన్స్ ఎవరనే ఉత్కంఠ ఫ్యాన్స్ లో కొనసాగుతుంది. ఐతే ఈ చిత్రం ఆర్ ఆర్ ఆర్ తర్వాత విడుదల కానున్న నేపథ్యంలో పాన్ ఇండియా చిత్రంగా విడుదలయ్యే సూచనలు కలవు. దీనితో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హీరోయిన్ అయితే బెటర్ అని భావిస్తున్నారు.
ఇక లక్కీ లేడీ పూజ హెగ్డే, కియారా అద్వానీ పేర్లు ఎన్టీఆర్ చిత్రం కోసం ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
కాగా వీరిద్దరూ కాకుండా అనూహ్యంగా శృతి హాసన్ పేరు తెరపైకి వచ్చింది. త్రివిక్రమ్ ఓ హీరోయిన్ గా శృతి హాసన్ ని తీసుకోవాలని భావిస్తున్నాడని సమాచారం. పాత్ర రీత్యా శృతి చక్కగా సెట్ అవుతుందని ఆయన ఆలోచనట. ఐతే శృతి హాసన్ అసలు ఇప్పుడు ఫార్మ్ లో లేదు, అలాగే గతంలో ఈమె రామయ్య వస్తావయ్యా సినిమాలో ఎన్టీఆర్ కి జంటగా నటించింది. ఆ మూవీ పరాజయం పాలైంది. శృతి హాసన్ విషయంలో ఇన్ని ప్రతికూలతలు ఉండగా, ఆమెని ఎంపిక ఎలా చేస్తారు అనేది పెద్ద ప్రశ్న. నిజంగా శృతికి ఈ ఛాన్స్ దక్కితే లక్కు చిక్కినట్లే.