ప్రస్తుతం శృతి హసన్ తన కెరీర్ లో విజయాన్ని సాదిస్తూ చాలా సంతోషంగా ఉంది. ఆమె ప్రవర్తన చూస్తుంటే తన కెరీర్ పై చాలా నమ్మకంతో ఉందని అనిపిస్తోంది. శృతి హసన్ మాములుగా మీడియా ప్రతినిదులకు చాలా దూరంగా ఉండేది. కానీ ఇప్పుడు తను మారుతోంది. శృతి హసన్ ప్రస్తుతం చాలా రిలాక్స్ గా ఉంది. తను మీడియా వారితో చాలా ఫ్రెండ్లీ గా ఉంటోంది. ప్రస్తుతం శృతి హసన్ చాలా మారిందని తనకి దగ్గరవున్న వారు అంటున్నారు. దీనితో టాలీవుడ్లో సినిమాల తీయడానికి సౌకర్యంగా ఉందని ఈ మార్పు ఇక్కడ సినిమాల కోసమేనని అంటున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ‘దూకుడు’, ‘బిజినెస్ మాన్’ సినిమాలు విజయాన్ని సాదించిన తరువాత మహేష్ బాబులో కూడా ఇదేవిధమైన మార్పును చూడడం జరిగింది. ఇప్పుడు శృతి హసన్ కూడా అదే తరహాలో మీడియా వారితో సహకరించడం నిజంగా సంతోషించవలసిన విషయం. ఈ గ్లామరస్ నటి గురించి ఇకనుండి మరింత ఎక్కువ సమాచారని మీడియా ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది.