కమల్ హాసన్ కూతురు శ్రుతి హాసన్ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (డబ్ల్యు. డబ్ల్యు . ఎఫ్) చేపట్టిన ఎర్త్ హవర్ ద్వారా వాతావరణ మార్పులమీద మనకు అవగాహన కలిగిస్తుందట. ఈ ఎర్త్ హవర్ కాన్సెప్ట్ గత కొంత కాలంగా చాల పెద్ద హిట్ అయింది. ఆమిర్ ఖాన్, అభిషేక్ బచ్చన్, విద్య బాలన్, సచిన్ టెండూల్కర్, రానా దగ్గుబాటి మరియు ధనుష్ తదితర తారలు ఇందులో పాలుపంచుకున్నారు.
ఈ ఎర్త్ హవర్ గురించి మాట్లాడుతూ శ్రుతి “ఇలాంటి సంస్థతో ముడిపడటం నిజంగా నా అదృష్టం. ఎర్త్ హవర్ లాంటి మంచి ఉద్దేశం కలిగిన ప్రచారం నాకెప్పుడు ఆనందమే. మనం మంచి వాతావరణాన్ని చూడాలంటే అది మన మార్పు ద్వారానే సాధ్యపడుతుంది. విద్యుత్ వినియోగంలో చిన్న చిన్న చిట్కాలు ఉపయిగించడం ద్వారా చాలా మార్పు తీసుకురావచ్చని” చెప్పింది.
ప్రస్తుతం శ్రుతి హాసన్ హైదరాబాద్లో ‘ఎవడు’ సినిమా షూటింగ్లో బిజీగా ఉంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రామ్ చరణ్ హీరోగా నటిస్తుండగా యామి జాక్సన్ సెకండ్ హీరొయిన్ గా కనిపించనుంది. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత. ఇందులో అల్లు అర్జున్ మరియు కాజల్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు