అక్షయ్ కుమార్ తో జతకట్టనున్న శృతిహాసన్ ?

Shruthi-hasan-and-Akshay-Ku
బాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం శృతి హాసన్ హిందీలో మరో పెద్ద అవకాశాన్ని చేజిక్కించుకుంది. ఇప్పటికే ఆమె ‘లక్’ మరియు ‘దిల్ తో బచ్చా హై జీ’ సినిమాలలో నటించింది. ‘గబ్బర్ సింగ్’ విజయం తరువాత దక్షిదిణాదిలో అగ్రతారగా నిలిచింది. ఈరోజు ఈ భామ నటించిన ‘డి-డే’ మరియు ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాలు మంచి సందనను అందుకుంటుంది

ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం ‘టాగూర్’ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్న సంజయ్ లీలా భన్సాలి శృతి హాసన్ ను ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ హీరో. ముందుగా ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా అనుకున్నారు. ఇప్పటికే ‘ఇట్స్ ఎంటర్టైన్మెంట్’ అనే సినిమాలో వీరిద్దరూ నటిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాను శృతి గనుక అంగీకరిస్తే బాలీవుడ్లో ఆమె ఇక వెనుతిరిగి చూడనవసరం లేదు. ‘వేదం’, ‘గమ్యం’ ల డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాను మొదటిసారిగా బాలీవుడ్లో దర్శకత్వం వహిస్తున్నాడు

Exit mobile version