పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ‘వకీల్ సాబ్’ షూటింగ్ ఇటీవలే మొదలైంది. పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజుల నుండి షూటింగ్లో పాల్గొంటున్నారు. నిన్న మెట్రో స్టేషన్లో సైతం షూటింగ్ చేశారు. ఆ ఫోటోలు కూడ బాగా వైరల్ అయ్యాయి. వచ్చే వారం వరకు పవన్ కళ్యాణ్ మీదే షూటింగ్ జరపనున్నారు. ఇక సినిమాలో పవన్ సరసన కథానాయకిగా శృతి హాసన్ నటించనుందని ఇదివరకే కన్ఫర్మ్ కాగా ఆమె కూడ త్వరలోనే షూటింగ్లో పాల్గొననుంది.
డిసెంబర్ మొదటి వారం నుండి కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. ఈ షెడ్యూల్ నుండి శృతి హాసన్ షూటింగ్లో జాయిన్ కానుంది. చిత్ర సన్నిహిత వర్గాల సమాచారం మేరకు శృతి హాసన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఉంటుందని తెలుస్తోంది. డిసెంబర్ ఎండింగ్ నాటికి సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నారు టీమ్. ఇందులో నివేత థామస్ కూడ ఒక కీ రోల్ చేస్తోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు బ్యానర్ పై రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. వీలైనంతవరకు సినిమాను సంక్రాంతి కానుకగా విడుదలచేయాలని చూస్తున్నారు.