టి.వి యాంకర్ తో గొంతుకలపనున్న శృతిహాసన్

Shruti_Haasan
పాటల ప్రపంచంలో శృతిహాసన్ కు ఈ ఏడాది కొత్తగా సాగుతుందనే చెప్పాలి. ఈ సంవత్సరం మొదట్లో రేస్ గుర్రం సినిమాలో ఒకపాటను, తమిళ సినిమా మాన్ కరాటే లో ఒక పాటను చిత్రీకరించనున్నారు. గతకొన్నాళ్ళుగా చెన్నై, ముంబైలలో కొంతమంది ప్రముఖ సంగీతదర్శకులను, మ్యుజీషియన్లను కలుస్తుంది. వారిలో స్వరరాజం ఇళయరాజాకూడా వుండటం విశేషం

తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ భామ కామెడి నయిట్స్ విత్ కపిల్ తో యాంకర్ గా వ్యవహరిస్తున్న కపిల శర్మతో కలిసి పాటపాడనుందట. కపిల్ కి ముందునుంచి పాటలంటే ఇష్టమని, తానే ముందుగా ఈ పాటల అభ్యర్ధనను బయటపెట్టినట్లు తెలిపింది. శృతిహాసన్ ఎలాగో మంచి గాయని కాబట్టి ఈ పాట రికార్డింగ్ దశనుంచే వార్తగా నిలిచింది. సుక్వీందర్ సింగ్ ఈ పాటను కంపోజ్ చెయ్యనున్నాడు.

ప్రస్తుతం శృతిహాసన్ త్వరలో రానున్న హిందీ సినిమా షూటింగ్ కోసం దుబాయ్ వెళ్ళింది. వెల్కమ్ బ్యాక్, గబ్బర్ సినిమాలలో ఈ భామ నటిస్తుంది

Exit mobile version