టాలీవుడ్ అందాల రాణిగా మారిన శృతి హసన్

Shruthi-Hassan

కొద్ది సంవత్సరాలకు ముందు వరకు నిర్మాతలు శృతి హసన్ తో సినిమాలు చేయడానికి భయపడ్డారు. కారణం ఆమె నటించిన సినిమాలు సరిగా ఆడలేదు. దీనితో ఆమె నటించిన సినిమాలు హిట్ అవ్వవు అని ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్ నడించింది. కానీ తను నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమా హిట్ సాదించడంతో మొత్తం మారిపోయింది. ఒక్క రాత్రితో తన జాతకం మొత్తం మారిపోయింది. ఈ సినిమాలో ఆమె చేసిన పాత్రతో మంచి గుర్తింపు వచ్చింది.
ప్రస్తుతం తను టాలీవుడ్ లో పెద్ద ప్రాజెక్ట్స్ లో నటిస్తూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరుగా ఉంది. ఈ క్రేజ్ ను సంపాదించుకోవడానికి శృతి హసన్ సినిమాలలో గ్లామరస్ పాత్రలను ఎంచుకుంది . తను సిజ్జ్లింగ్ దుస్తులలో చాలా అందంగా కనిపించింది. ప్రస్తుతం తను టాలీవుడ్ కొత్త గ్లామర్ క్వీన్ గా మారింది. ప్రస్తుతం విడుదలకు సిద్దంగా ఉన్న ‘బలుపు’ సినిమాలో శృతి హాసన్ స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించనుంది అని సమాచారం. అలాగే ‘ఎవడు’, ‘రామయ్యా వస్తావయ్యా’ కూడా శృతి హాసన్ అందంగా కనిపించనుంది.

Exit mobile version