ప్రస్తుతం శృతి హసన్ కి చాలా డిమాండ్ ఉంది. ఆమె చక్కది శరీర సౌందర్యాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా తన అందాన్ని గ్లామరస్ గా చూపించడానికి ఎక్కడ సంకోచించాడు. శృతి హసన్ ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన ‘రేసు గుర్రం’ సినిమా లో నటిస్తోంది. ఆమె ఈ సినిమాలో కొన్ని అందమైన దుస్తుల్లో కనిపించనుంది. ఎవరైనా ఆ సినిమాలో ఆ ఫొటోస్ ను చూస్తే ఆమె తన అందంతో అందరిని ఆకర్శించాలనుకుంటుందని అనుకుంటారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా ఆడియోని మార్చి 16న విడుదల చేయనున్నారు.