ఒకానొక రాబోయే తెలుగు చిత్రంలో ఐటం సాంగ్ చేస్తున్నట్టు వచ్చిన వార్తలను శ్రుతి హాసన్ ఖండించింది. 2013 జనవరిలో విడుదల కానున్న ఒకానొక ప్రముఖ చిత్రంలో శ్రుతి హాసన్ ఐటం సాంగ్ కి డాన్స్ చేయ్యబోతున్నట్టు పుకార్లు వచ్చింది. “నేను తెలుగులో ఎటువంటి ఐటం సాంగ్ చెయ్యట్లేదు ప్రస్తుతం చిత్రీకరణలో బిజీ గా ఉన్నాను త్వరలో “బలుపు” చిత్రీకరణలో పాల్గోనబోతున్నాను” అని ట్విట్టర్లో చెప్పారు. ప్రస్తుతం ఈ నటి “నువ్వొస్తానంటే నేనొద్దంటానా?” చిత్ర హిందీ రీమేక్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రభు దేవ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో గిరీష్ తౌరని ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆమె రాబోతున్న “బలుపు” చిత్రం త్వరలో చిత్రీకరణ మొదలు పెట్టుకోనుంది. “బలుపు” చిత్రంలో రవితేజ సరసన శ్రుతి హాసన్ కనిపించనున్నారు. గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో తన పాత్ర గురించి శ్రుతి హాసన్ ఆత్రుతగా వేచి చూస్తున్నారు. మంచి హాస్యాన్ని పండించే పాత్రలో శ్రుతి హాసన్ కనిపించనుంది.