పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా వస్తున్న చిత్రం “గబ్బర్ సింగ్” ఈ చిత్ర చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటుంది. మా వద్ద ఉన్న సమాచారం ప్రకారం శ్రుతి హాసన్ ఈ చిత్రం లో భాగ్యలక్ష్మి అనే పాత్ర్హలో కనిపించబోతున్నారు. హిందీ దబాంగ్ చిత్రం లో సోనాక్షి సిన్హా చేసిన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రం దబాంగ్ రిమేక్ అన్న విషయం విదితమే. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ మీద గణేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ వేసవి కి చిత్రాన్ని విడుదల చేయనున్నారు.