పవన్ కళ్యాణ్ మరొసారి హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రంపై అభిమానుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో కథానాయకిగా శృతిహాసన్ నటించవచ్చనే వార్తలు వినబడుతున్నాయి. శృతిహాసన్ గతంలో పవన్, హరీష్ శంకర్ చేసిన ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో నటించడం జరిగింది. ఒకరకంగా ఆ సినిమాతోనే ఆమె స్టార్ హీరోయిన్ అయ్యారు. ఆ తర్వాత పవన్ చేసిన ‘కాటమరాయుడు’లో మెరిసింది శృతి.
అదే తెలుగులో ఆమె చేసిన లాస్ట్ ప్రాజెక్ట్. దాని తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న అమె ఈమధ్యే రవితేజ ‘క్రాక్’కు సైన్ చేశారు. పవన్ తో ఆమె జోడీకి మంచి క్రేజ్ ఉండటం, పైగా తమ ముగ్గురి కాంబినేషన్ కలిసిరావడంతో హరీష్ ఆమెను కథానాయకిగా తీసుకునే ఆలోచనలో ఉన్నారట.
మరి ఈ వార్తల్లో ఎంతమేర వాస్తవముందో తెలియాలంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ అందేవరకు ఆగాల్సిందే. ఇకపోతే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇంకొద్ది నెలల్లో సెట్స్ మీదికి వెళ్లనుంది.