వివాదాస్పదంగా మారిన శృతి హసన్ ‘డి-డే’ ఫోటో

Shruti_Haasan

ఈ మధ్యే విడుదలచేసిన బాలీవుడ్ సినిమా ‘డి – డే’ పోస్టర్ లో శృతి హసన్ చాలా హాట్ గా కనిపించింది. ఈ విషయం గురించే ప్రస్తుతం అందరు మాట్లాడుకుంటున్నారు. ఈ ఫోటో ద్వారా ఈ సినిమాకు గుర్తింపు రావడమే కాకుండా ఈ సినిమా నిర్వాహకులకు కొన్ని ఇబ్బందులను కూడా తీసుకువచ్చింది. ముంబైలోని కొన్నిసోషల్ నెట్ వర్క్ సంస్థలు ఈ ఫోటో పై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సీన్స్ ని తొలగించాలని వారు కోరుతున్నారు. ఫేమస్ గ్యాంగ్ స్టార్ దావూద్ ఇబ్రహీం కథని ఆదరంగా చేసుకొని నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతి హసన్ పాకిస్తాన్ అంగరక్షకురాలుగా నటిస్తోంది. తెలుగులో బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సాదించిన ‘గబ్బర్ సింగ్’ సినిమాలో పక్కింటి అమ్మాయిగా కనిపించిన శృతి హసన్ ఇలాంటి ఫోటోలో కనిపించడం తెలుగు ప్రేక్షకులకు నచ్చడం లేదు.

Exit mobile version