విజయం మన నీడన ఉన్నప్పుడు ఎటువంటి ఆటంకాలూ ఆ విజయాన్ని మననుండి ఆపలేవు. ప్రస్తుతం ఈ సూక్తి శృతిహాసన్ కు సరిగ్గా సరిపోతుంది. కమల్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ భామ ‘గబ్బర్ సింగ్’ విజయంతో వెనుతిరిగి చూడటంలేదు
‘డి డే’ సినిమాలో ఈమె కనబరచిన నటనను చుసిన అనీస్ బాజ్మి తన తదుపరి సినిమా ‘వెల్ కం బ్యాక్’ లో నాయికగా ఎంచుకున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ముందుగా ఈ పాత్రకు ఆసిన్ ను అనుకున్నారంట. ఇప్పుడు ఆ ప్లేస్ శృతికి దక్కింది. ఈ సినిమాను శృతి అంగీకరించడంతో ఆసిన్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ వార్తను జీర్ణించుకోలేని ఆసిన్ తన సెక్రటరీని తిట్టి, ఆ డైరెక్టర్ తో ఇంకెప్పుడూ పనిచేయ్యనని చెప్పిందట